ఈ సమయంలో సడలింపులు చేస్తే?

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమవుతుంది. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలులో మినహాయింపులు [more]

Update: 2020-04-19 06:30 GMT

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమవుతుంది. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలులో మినహాయింపులు ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ లాక్ డౌన్ వచ్చే నెల 3వ తేదీ వరకూ కఠినంగా అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తే కేసులు సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనిపై ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News