తెలంగాణాయే బెస్ట్.. ఏపీ వేస్ట్…సుజనా సీరియస్ కామెంట్స్

కరోనాపై నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పనితీరు [more]

Update: 2020-04-19 06:07 GMT

కరోనాపై నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పనితీరు బాగా ఉందని, అదే సమయంలో ఏపీలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతుందని సుజనా చౌదరి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పాలనపై కాకుండా కక్ష సాధింపు చర్యలపైనే దృష్టి పెట్టిందని సుజనా చౌదరి విమర్శించారు. కరోనా కారణంగా ప్రపంచ మొత్తం భయపడుతుంటే, ఏపీలో మాత్రం ప్రభుత్వం రాజకీయాలపైనే దృష్టి పెట్టారని ఆయన అన్నారు.

Tags:    

Similar News