తెలంగాణలో ఆగని కరోనా… జిల్లాలకూ వ్యాప్తి

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 1,284 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]

Update: 2020-07-19 02:43 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 1,284 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43,780 కు చేరుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 409కి చేరుకుంది. కాగా తెలంగాణలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు 12,675 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 30,607గా ఉంది. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా 667 కేసులు హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. జిల్లాల్లో కూడా అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News