మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు..కీలక బిల్లులకు

తెలంగాణ శాససనసభ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో కీలక చట్టాలను ఆమోదిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు [more]

Update: 2020-10-13 03:47 GMT

తెలంగాణ శాససనసభ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో కీలక చట్టాలను ఆమోదిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నాలుగు చట్ట సవరణ ముసాయిదా బిల్లులపై చర్చ జరగనుంది. దీంతో పాటు వ్యవసాయ భూమి ఇతర అవసరాలకు వినియోగించడం, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు.

Tags:    

Similar News