కొత్త శిఖరాలకు సెన్సెక్స్ : పరుగులు పెడుతున్న ఆర్ధిక రంగం

బుధవారం స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులు సృష్టించింది. ఓ దశలో 63,588 పాయింట్లతో అల్ టైం హై ని నమోదు చేసింది.

Update: 2023-06-21 15:23 GMT

బుధవారం స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులు సృష్టించింది. ఓ దశలో 63,588 పాయింట్లతో ఆల్ టైం హై ని నమోదు చేసింది. తర్వాత లాభాలు కాస్త తగ్గి 63,523 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 18856 పాయింట్లతో రికార్డులు నమోదు చేస్తూ ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు సెన్సెక్స్ 4 శాతం పెరగడం గమనార్హం. ఈ రోజు ఫైనాన్స్, మీడియా, రియాలిటీ రంగాలు పండించగా, ఫార్మా, హెల్త్ కేర్ నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి స్వల్పం గా నష్టపోయి 82.10 కొనసాగుతోంది.

మార్చ్ క్వార్టర్ లో భారత ఆర్ధిక రంగం పరుగులు పెట్టింది. ద్రవ్యోల్బణం కూడా కాస్త నెమ్మదించింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో మన దేశం కూడా ఉందని మన ఆర్ధిక రంగం రుజువు చేస్తోంది. రుతు పవనాలు కానీ సక్రమంగా ఉంటే, ఈ ఏడాదంతా స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత ఆర్ధిక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని వారు పేర్కొంటున్నారు. 

Tags:    

Similar News