రేవంత్ రెడ్డి అరెస్ట్ అందుకే?

రేవంత్ రెడ్డిని నర్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డ్రోన్ కెమెరాలు వాడారన్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి పై కేసు నమోదైంది. ఈ మేరకు [more]

Update: 2020-03-06 02:18 GMT

రేవంత్ రెడ్డిని నర్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డ్రోన్ కెమెరాలు వాడారన్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి పై కేసు నమోదైంది. ఈ మేరకు రేవంత్ రెడ్డితో పాటు తొమ్మిది మందిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఈ కేసులో ఏ1 రేవంత్ రెడ్డి , కృష్ణారెడ్డిలపై కేసు నమోదయింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రేవంత్ రెడ్డి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. అక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులు రేవంత్ రెడ్డికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న రేవంత్ రెడ్డిని పోలీసులు పూర్తిస్థాయిలో విచారించారు. అయితే కేటీఆర్ ఫాం హౌస్ మీద డ్రోన్ కెమెరాస్ ఎగురవేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తుల స్థలాలు ఆస్తులపైన డ్రోన్ కెమెరాలు ఎగరవేయడం పూర్తిగా నిషేధం. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం రేవంత్ రెడ్డి పైన అతని అనుచరుల పైన కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేటీఆర్ ఫాం హౌస్ విజువల్స్ తీసి దానిని సోషల్ మీడియా తో పాటు మీడియాకు రేవంత్ రెడ్డి ప్రచారం కల్పించాడు. రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.

Tags:    

Similar News