Union Budget : వీరు ఆదాయపు పన్ను అసలు చెల్లించాల్సిన అవసరం లేదు మీకు తెలుసా?
ఆదాయం ఇంత ఉంటే పైసా పన్ను కట్టక్కర్లేదు
ఆదాయం ఇంత ఉంటే పైసా పన్ను కట్టక్కర్లేదు.. ఈ విషయం మీకు తెలుసా. ఆదాయం పన్ను రిబేట్ అంటే ఏంటి? టాక్స్ సున్నా ఎలా చేసుకోవచ్చో మీకు తెలుసా? టాక్స్ రిబేట్ అంటే పన్ను కట్టే వారి ఆదాయం ఒక నిర్దిష్ట పరిమితి లోపు ఉంటే, వారిరికి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం ఇచ్చే ఈ ఉత్సాహం వల్ల చాలామందికి ఆదాయపు బారి నుంచి మినహాయింపు లభిస్తోంది. ప్రభుత్వం మధ్య తరగతి, తక్కువ ఆదాయ వర్గానికి ఊరటగా టాక్స్ రిబేట్ అమలు చేస్తుంది.ఆన్ లైన్ లేదా ఫిజికల్‌గా ఐటి రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఇది వర్తిస్తుంది.
కొత్త పన్ను విధానంలో...
ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో ఐదేళ్ల నుంచి మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకూ 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి టాక్స్ రిబేట్ ఉంది.అంటే 12 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే పన్ను చెల్లించాల్సిన పని లేదు. పోస్టు 2025 బడ్జెట్ ప్రకారం, స్టాండర్డ్ డిడక్షన్ 75 వేలు వర్తిస్తుంది. అప్పుడు రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను పడదు. పాత పన్ను విధానంలో, సెక్షన్ 87A ప్రకారం, 5 లక్షల వరకు ఆదాయానికి టాక్స్ లేదు. స్టాండర్డ్ డిడక్షన్ కలిపి వేతన జీవులకు రూ. 5.50 లక్షల వరకు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
భారత పౌరులకు మాత్రమే...
అయితే పన్ను రిబేట్ భారతదేశ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఎన్ఆర్ఐ లకు, సంస్థలకు, హెచ్.యూ.ఎఫ్ లకు ఇది వర్తించదు. క్యాపిటల్ గెయిన్స్ అంటే బంగారం, షేర్లు అమ్మి వచ్చే ఆదాయం వంటి ప్రత్యేక ఆదాయానికి రిపేట్ వర్తించదు. ఇప్పుడు టాక్స్ రిబేట్ పరిమితిని ఇంకా పెంచాలని చాలా మంది కోరుతున్నారు. 2026 బడ్జెట్ ప్రవేశపెట్టిన తరవ్వాత తేలనుంది. అదనంగా, క్యాపిటల్ గెయిన్స్‌కి కూడా ఈ సౌకర్యాన్ని ఇవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయం స్థాయి కొద్దిగా పెరగగానే పన్ను బారం ఒక్కసారిగా పెరగకుండా ఉండేందుకు మార్జినల్ రిలీఫ్ కూడా ఉంటుంది.