India vs Newzealand : నేడు భారత్ - న్యూజిలాండ్ చివరి టీ20 మ్యాచ్
భారత్ - న్యూజిలాండ్ టీ 20 లో ఐదో మ్యాచ్ నేడు తిరువనంతపురంలో జరగనుంది
భారత్ - న్యూజిలాండ్ టీ 20 లో ఐదో మ్యాచ్ నేడు తిరువనంతపురంలో జరగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 3-1 తో భారత్ సిరీస్ ను చేజిక్కించుకుంది. చివరి టీ20లోనూ గెలిచి 4-1తో సిరీస్ ను ముగించాలని భారత్ భావిస్తుంది. వరల్డ్ కప్ కు ముందు చివరి టీ20 కావడంతో ఈ మ్యాచ్ లో విజయం చేజిక్కించుకుని ధీమాగా వరల్డ్ కప్ లోకి అడుగు పెట్టాలని భారత్ ఆశతో ఉంది. వన్డే సిరీస్ ను కోల్పోయినా రెట్టించిన ఉత్సాహంతో టీ20 సిరీస్ ను చేజిక్కించుకోవడం వరల్ కప్ కు ముందు భారత్ కు బూస్ ఇచ్చే అంశమే.
కివీస్ కసిగా...
అదే సమయంలో న్యూజిలాండ్ కూడా చివరి టీ20ను కేరళలో కైవసం చేసుకుని సిరీస్ పోయినా తమలో కసి తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటుంది. కివీస్ కూడా ఈ మ్యాచ్ లో దూకుడు ఆడి భారత్ ను ఛేదనలో అయినా.. బౌలింగ్ లో అయినా అడ్డుకట్ట వేయాలని చూస్తుంది. అందుకోసమే విశాఖ తరహాలోనే మరోసారి కేరళలోనూ పరుగుల తుపాను సృష్టించాలని భావిస్తుంది. అందుకోసం నేటి మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. మైదానం ఏదైనా భారత్ ను ఓడించడమే లక్ష్యంతో కివీస్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతుంది.
కొన్ని మార్పులతో...
భారత్ ఒకరకంగా బ్యాటింగ్ లో కొన్ని ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. అదే సమయంలో బౌలింగ్ పరంగా కూడా పదును దేలాల్సి ఉంది. సిరీస్ గెలవడంతో విశాఖ మ్యాచ్ లో భారత్ ఐదుగురు బౌలర్లకు అవకాశమిచ్చారు. కానీ తిరువనంతపురం మ్యాచ్ లో మాత్రం ఆ పనిచేయరు. స్వల్ప మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే న్యూజిలాండ్ కూడా స్వల్ప మార్పులతో మైదానంలో దిగే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. అయితే చివరి మ్యాచ్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ ఇస్తుందనే చెప్పాలి.