రాయపాటి కోడలిని విచారిస్తున్న పోలీసులు

రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను పోలీసులు విచారిస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రాయపాటి కోడలు మమతను విచారిస్తున్నారు. డాక్టర్ మమత గుంటూరు లోని రమేష్ [more]

Update: 2020-08-14 07:37 GMT

రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను పోలీసులు విచారిస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రాయపాటి కోడలు మమతను విచారిస్తున్నారు. డాక్టర్ మమత గుంటూరు లోని రమేష్ ఆసుపత్రిలో చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తమకు స్వర్ణప్యాలెస్ ఘటనతో సంబంధం లేదని రాయపాటి కుటుంబం చెబుతోంది. ఇది వరకే రాయపాటి కోడలు మమతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా గుంటూరు ఆసుపత్రిలోనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News