రెమి డెసిమర్ కోసం క్యూ కడుతూ…?

కరోనా వ్యాధి నివారణ కోసం వాడుతున్న రేమి డెసిమిర్ మెడిసిన్ కోసం ఇప్పుడు ప్రజలు ఎగబడుతున్నారు. ఈ మెడిసిన్ ఎక్కడపడితే అక్కడ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. [more]

Update: 2021-04-20 00:40 GMT

కరోనా వ్యాధి నివారణ కోసం వాడుతున్న రేమి డెసిమిర్ మెడిసిన్ కోసం ఇప్పుడు ప్రజలు ఎగబడుతున్నారు. ఈ మెడిసిన్ ఎక్కడపడితే అక్కడ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సూచించిన కేంద్రాల్లో మాత్రమే ఈ మెడిసిన్ అమ్ముతున్నారు. మెడిసిన్ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా మెడిసిన్ తయారీ చేసే కంపెనీలే స్వయంగా అమ్మకాలు చేపడుతున్నాయి. దీంతోపాటుగా ఈ మెడిసిన్ అవసరం ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కంపెనీ కి కాల్ చేసినట్లయితే డైరెక్ట్ గా మెడిసిన్ డెలివరీ చేస్తున్నారు. ఇన్ని చేసినప్పటికీ మెడిసిన్ కొరత ఉందని ప్రచారం జరగడంతో దానికోసం కరోనా వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాదులోని హెట్రో డ్రగ్స్ కేంద్ర కార్యాలయం ముందు రేమి డెసిమిర్ మెడిసిన్ కోసం కరోనా బాధితులు క్యూలు కట్టారు.

Tags:    

Similar News

.