ఏపీ సర్కార్ కు పవన్ కల్యాణ్ డెడ్ లైన్

ఆంధ్రప్రదేశ్ వ్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. [more]

Update: 2021-07-22 06:13 GMT

ఆంధ్రప్రదేశ్ వ్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. నెలాఖరులోగా రైతుల నుంచి సేకరించిన ప్రతి గింజకు డబ్బులు చెల్లించాలని లేకుంటే రైతుల కోసం ఉద్యమిస్తామని పవన్ కల్యాణ్ డెడ్ లైన్ పెట్టారు. దళారులను మించి పోయి రైతులు రోడ్డు మీదకు తెచ్చిన ప్రభుత్వం ఇదేనని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించడంలో విఫలమవుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News