ఇంగిత జ్ఞానం వైసీపీ నేతలకు ఉందా?

వ్యక్తిగత జీవితాలను వైసీపీ నేతలు వివాదంలోకి లాగుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. మూడు పెళ్లిళ్లు అంటూ [more]

Update: 2019-11-14 07:53 GMT

వ్యక్తిగత జీవితాలను వైసీపీ నేతలు వివాదంలోకి లాగుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. మూడు పెళ్లిళ్లు అంటూ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఇంగిత జ్ఞానం అంటే అసలు వైసీపీ నేతలకు అర్థమవుతుందో? లేదో? అని పవన్ కల్యాణ‌్ ఎద్దేవా చేశారు. మీ ఇంగ్లీష‌ లో చెప్పాలంటే కామన్ సెన్స్ అని చమత్కరించారు. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కన్నడ ను విస్మరిస్తే చర్యలు తప్పవని అక్కడ మంత్రి హెచ్చరిస్తే, ఇక్కడ తెలుగును విస్మరించకపోతే చర్యలంటున్నారని సెటైర్ వేశారు. తెలుగు మాధ్యమాన్ని తొలిగిస్తే తప్పకుండా మట్టిలో కలిసిపోతారని పునరుద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం భాషా సరస్వతిని అవమానిస్తుందన్నారు. భాషను కాపాడటమే జనసేన లక్ష్యమన్నారు.

Tags:    

Similar News