వాటి విలువ రెండు కోట్లు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. డైరెక్ట్ రెవెన్యూ అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ బండారం బయటపడింది. ఈ [more]
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. డైరెక్ట్ రెవెన్యూ అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ బండారం బయటపడింది. ఈ [more]
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. డైరెక్ట్ రెవెన్యూ అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ బండారం బయటపడింది. ఈ బంగారం అంతా దుబాయి నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు. మొత్తం ఐదు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు. దుబాయ్ ఎయిర్ పోర్టులో కొంతమంది వ్యక్తులు ముగ్గురు ప్రయాణికులను నమ్మించి ఈ బంగారం ఇచ్చి హైదరాబాద్ లో తమకు తెలిసిన వారికి వాటిని ఇవ్వాలని ఆ అపరిచిత వ్యక్తులు నమ్మించారు. హైదరాబాద్ చేరుకున్న తరువాత తమ వారు వస్తారని మీకు అక్కడికి దిగగానే ఫోన్ చేస్తామని నమ్మించారు. ఇలా దుబాయి నుంచి హైదరాబాదుకు వచ్చే ముగ్గురు ప్రయాణికులకు ఈ బంగారు బిస్కెట్లను ఇచ్చారు. అందులో ఏముందో తెలియని ప్రయాణికులు ఎయిర్ పోర్టు దిగగానే పోలీసుల తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి.
అపరిచితులతో జాగ్రత్త…..
ముగ్గురి వద్ద మూడు కవర్లలో మొత్తం 48 బంగారం బిస్కెట్లు లభించాయి. ఈ బంగారం ఎవరికి ఇవ్వాలన్న విషయాన్నిఖచ్చితంగా ఆ వ్యక్తులు చెప్పలేదని పట్టుబడ్డ వారు పోలీసులకు తెలిపారు. గోల్డ్ మాఫియానే ఈ ప్రయాణికుల ద్వారా బంగారం బిస్కెట్లను ఇక్కడికి పంపించారని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా తమ చేతికి మట్టి అంటకుండా అమాయకులైన ప్రయాణికులతో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంది. ఈ బంగారం విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.