బ్రేకింగ్ : ఈరోజు ఆరు కేసులే.. తెలంగాణలో తగ్గుతున్న కరోనా

తెలంగాణలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈరోజు కొత్తగా కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. దీంతో [more]

Update: 2020-04-28 13:01 GMT

తెలంగాణలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈరోజు కొత్తగా కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1009కు చేరుకుంది. ఈ నెల 21 తేదీ నుంచి సింగిల్ డిజిట్ లోనే కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 610 మంది కరోనా చికిత్స పొందుతున్నారని చెప్పారు. వచ్చిన కేసుల్లో యాభై శాతం హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 374 మంది డిశ్చార్జ్ అయ్యారని ఈటల రాజేందర్ తెలిపారు. టెస్ట్ ల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి కేసుల సంఖ్య తక్కువగా ఉందన్న విమర్శలు సరికాదని ఆయన తెలిపారు. కొందరు పనిలేని వాళ్లు ఈరకమైన ప్రచారం చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News