విరుచుకుపడుతున్న వైరస్… కేంద్ర బృందం పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజు 66 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

Update: 2020-04-18 01:34 GMT

తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజు 66 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరుకుంది. అత్యధికంగా హైదరాబాద్ లో 286 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 55 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కంటెయిన్ మెంట్ ఏరియాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను ఏప్రిల్ 20వ తేదీ తర్వాత కూడా సడలించే అవకాశాలు లేవు. రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ సడలింపుల విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర బృందం కూడా తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తోంది.

Tags:    

Similar News