ముందు జగన్ ను బయటకు రమ్మనండి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. జగన్ బయటకు వచ్చి తిరగాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. బయటకు [more]

Update: 2020-04-19 04:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. జగన్ బయటకు వచ్చి తిరగాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. బయటకు వచ్చి చూస్తే కరోనా వ్యాప్తి ఎంత ఉందో ఆయనకు తెలుస్తుందని రాజప్ప తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను టీడీపీ అధినేత చంద్రబాబు పాటిస్తున్నారన్నారు. అందుకే ఇంట్లోనే ఉంటున్నారని చెప్పారు. చంద్రబాబు బయటకు వచ్చి మాట్లాడాలని వైసీపీ నేతలు కోరడం అర్థరహితమని చినరాజప్ప వ్యాఖ్యానించారు. పట్టుదలకు పోకుండా కరోనా నియంత్రణకు జగన్ కృషి చేయాలని కోరారు.

Tags:    

Similar News