బ్రేకింగ్ : బీజేపీకి షాక్.. సీనియర్ నేత రాజీనామా

భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. బీజేపీకి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు రాజీనామా చేశారు. ఆయన కొంతకాలంగా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి [more]

Update: 2021-07-23 06:30 GMT

భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. బీజేపీకి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు రాజీనామా చేశారు. ఆయన కొంతకాలంగా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ప్రయోజనం కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పార్టీ వద్దన్నా మోత్కుపల్లి నరసింహులు హాజరయ్యారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మోత్కుపల్లి నరసింహులు బీజేపీకి రాజీనామా చేసి త్వరలోనే టీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయి. ఆయన కేసీఆర్ ను ఇటీవల కాలంలో పొగుడుతుండటమే అందుకు కారణం.

Tags:    

Similar News