9April-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఉగాది కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రధానంగా కన్నడ రాష‌్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో శ్రీశైలంలోని మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.

Update: 2024-04-09 12:33 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Srisailam : శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఉగాది కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రధానంగా కన్నడ రాష‌్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో శ్రీశైలంలోని మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.

IPL 2024 : జడ్డూ భయ్యా నువ్వు సూపరహే.. బౌలింగ్ అంటే అలా చేయాలి మరి

చెన్నైై సూపర్ కింగ్స్ కు విజయం దక్కింది. వరస ఓటములతో ఉన్న జట్టుకు జడేజా ప్రాణం పోసినట్లయింది. నిన్న జరిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ వరస విజయాలకు చెన్నై సూపర్ కింగ్స్ చెక్ పెట్టింది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్ లలో గెలుపు బాట పట్టింది.

Breaking : కవిత రిమాండ్ పొడిగింపు.. తీహార్ జైలులోనే బీఆర్ఎస్ నేత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో పూర్తయింది. దీంతో కల్వకుంట్ల కవితను నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశించారు. మరో పథ్నాలుగు రోజుల పాటు కవితను జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించారు.

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ దాడులు

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపార వేత్తల ఇళ్లు, కార్యాలయాల్లో ఈరోజు తెల్లవారు జాము నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 32 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Marriage : ఒకే ఇంట్లో పదిహేడు మందికి ఒకే సారి పెళ్లి.. అరుదైన ఘటన ఎక్కడంటే?

పెళ్లి అంటే మామూలు విషయం కాదు.. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయాలంటే గగనంగా మారుతుంది. పెళ్లి పత్రికల నుంచి ముహూర్తానికి వివాహ వేడుక జరిపించడం వరకూ ఒక పెద్ద కార్యమే చేయాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సాయం లేకుంటే మాత్రం పెళ్లిళ్లు చేయలేరు.

BJP : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని సిద్ధార్ధ సింగ్ నాధ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడటానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని కూడా ఆయన అన్నారు.

స్విమ్మింగ్ పూల్ లో పడి చిన్నారి మృతి

స్విమ్మింగ్ పూల్ లో పడి బాలిక మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్‌ఎ‌సీఎల్ గ్రేటర్ కమ్యునిటీకి చెందిన నిఖిల్ కుమార్ కుమార్తె ఆద్య కు ఈత నేర్పేందుకు నిన్న స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్లాడు. ఆద్య వయసు ఎనిమిదేళ్లు. ఈత నేర్చుకుంటుండగా తండ్రి నిఖిల్ కుమార్ తన డ్రెస్ ను మార్చుకునేందుకు రూములోకి వెళ్లారు.

Gold Prices Today : బంగారం ధరలు రికార్డు స్థాయికి.. ఇక కొనడం సాధ్యమా?

పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాటికి కళ్లెం పడటం లేదు. అదే సమయంలో వెండి కూడా పరుగులు పెడుతుంది. భారతీయ సంస్కృతి లో భాగమైన బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని విధంగా గత కొద్ది రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. అందరి అంచనాలకు మించి ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు.

గుండెపోటుతో సీనియర్ ఐపీఎస్ మృతి

సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో మరణించారు. ఈరోజు ఉదయం ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఏజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రాజీవ్ రతన్ కన్ను మూశారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో డీజీగా పనిచేస్తున్నారు. 1991 బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ అనేక హోదాల్లో పనిచేశారు.

Ys Jagan : నేడు బస్సు యాత్రకు బ్రేక్

నేడు వైఎస్ జగన్ బస్సు యాత్రకు విరామాాన్ని ప్రకటించారు. ఉగాది పండగ కావడంతో ఆయన తన యాత్రకు నేడు బ్రేక్ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. అయితే ఈరోజు ఉగాది పండగ కావడంతో ఆయన తన యాత్రకు బ్రేక్ ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.




Tags:    

Similar News