Sun Mar 15 2026 15:03:46 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు బస్సు యాత్రకు బ్రేక్
నేడు వైఎస్ జగన్ బస్సు యాత్రకు విరామాాన్ని ప్రకటించారు. ఉగాది పండగ కావడంతో ఆయన తన యాత్రకు నేడు బ్రేక్ ఇచ్చారు

నేడు వైఎస్ జగన్ బస్సు యాత్రకు విరామాాన్ని ప్రకటించారు. ఉగాది పండగ కావడంతో ఆయన తన యాత్రకు నేడు బ్రేక్ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. అయితే ఈరోజు ఉగాది పండగ కావడంతో ఆయన తన యాత్రకు బ్రేక్ ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉగాది వేడుకల్లో...
తన కుటుంబ సభ్యులతో కలసి ఉగాది పండగ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. గత నెల 27వ తేదీ నుంచి జగన్ ఇడుపులపాయ నుంచి మేమంతా బస్సుయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు యాత్ర చేరుకుంది.
Next Story

