Sun Mar 15 2026 13:12:27 GMT+0530 (India Standard Time)
గుండెపోటుతో సీనియర్ ఐపీఎస్ మృతి
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో మరణించారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో మరణించారు. ఈరోజు ఉదయం ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఏజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రాజీవ్ రతన్ కన్ను మూశారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో డీజీగా పనిచేస్తున్నారు. 1991 బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ అనేక హోదాల్లో పనిచేశారు.
మేడిగడ్డపై...
ఇటీవల మేడిగడ్డ కుంగిపోవడంపై కూడా ఆయన విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను ఇచ్చారు. ఆయన కరీంనగర్ ఎస్పీగా కూడా పనిచేశారు. తర్వాత వివిధ హోదాల్లో పనిచేసిన రాజీవ్ రతన్ మరణించడంపై పలువురు సంతాపాన్ని ప్రకటించారు. పలువురు ప్రజానితిధులు కూడా రాజీవ్ రతన్ మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు.
Next Story

