Wed Jan 22 2025 15:03:13 GMT+0000 (Coordinated Universal Time)
BJP : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రయివేటీకరణ జరగదని సిద్ధార్ధ సింగ్ నాధ్ తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని సిద్ధార్ధ సింగ్ నాధ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడటానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని కూడా ఆయన అన్నారు.
అమరావతి నిర్మాణం కూడా...
అలాగే రాజధానిగా అమరావతి నిర్మాణం కూడా పూర్తవుతుందని సిద్ధార్థసింగ్ నాద్ తెలిపారు. రాజధాని నిర్మాణపు పనులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే శరవేగంగా జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. అలాగే పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
Next Story