5April-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

తెలంగాణలో నేడు భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనుంది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు దీక్షలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ఈ దీక్షలు సాగనున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఈ దీక్షలను జరగనున్నాయి.

Update: 2024-04-05 12:29 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

BJP : నేడు తెలంగాణలో బీజేపీ సత్యాగ్రహ దీక్షలు

తెలంగాణలో నేడు భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనుంది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు దీక్షలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ఈ దీక్షలు సాగనున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఈ దీక్షలను జరగనున్నాయి.

Sujana Choudhary : గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే.. ఎందుకంటే ఇక్కడ ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం?

బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఈ ఎన్నికల్లో సాహసానికి దిగారనే చెప్పాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేయనున్నారు. పార్టీ ఇప్పటికే ఆయనకు టిక్కెట్ ప్రకటించింది. అయితే ఇది సుజనా చౌదరి అతి పెద్ద సాహసానికి దిగినట్లే చెప్పాలి.

Congress Manifesto: ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీస్’.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫేస్టో

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మ్యానిఫేస్టోను విడుదల చేశారు. పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ పేరుతో ఈ మ్యానిఫేస్టోను విడుదల చేశారు.

Ys Sharmila : జగనన్నను ఓడించండి.. అవినాష్ కు ఓటేయకండి

వైఎస్ షర్మిల కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించారు. బద్వేలు నియోజకవర్గంలో బస్సు యాత్రను ప్రారంబించిన షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. హత్యా రాజకీయాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జగనన్నను ఓడించాలని ఆమె కోరారు. అలాగే కడప పార్లమెంటు నుంచి అవినాష్ రెడ్డిని ఓడించాలని కూడా ఆమె పిలుపునిచ్చారు.

IPL 2024 : క్యాచ్ వదిలేయకుంటే.. గెలుపు ఖచ్చితంగా గుజరాత్‌దే.. అదే మ్యాచ్ ను మార్చేసింది

ఐపీఎల్ మ్యాచ్ లు అంతే. చివరి ఓవర్లలో టర్న్ తీసుకుంటాయి. ఏమాత్రం ఆటగాళ్లు అజాగ్రత్తగా ఉన్నా సరే. మ్యాచ్ చేజారి పోతుంది. నిన్న గుజారాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ దే విజయం అయింది. పెద్ద లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఇందులో ఒకే ఒక క్యాచ్ మ్యాచ్ దశను...

తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

దూరదర్శన్ లో న్యూస్‌రీడర్ శాంతిస్వరూప్ మరణించారు. ఆయన తొలి తెలుగు న్యూస్ రీడర్. ఆయన రెండు రెండు రోజులు క్రితం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ యశోదా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. తెలుగు తొలి న్యూస్ రీడర్ గా ఆయనకు పేరుంది.

Purandhreswari : చిన్నమ్మ మీద ఈ ట్రోల్స్ ఏంటి బాబూ.. ఆయన చెప్పినట్లే చేస్తున్నారని అనుమానమా?

ఆంధ్ర్రప్రదేశ్ లో కూటమి ఏర్పడిన తర్వాత ఎక్కువగా ట్రోలింగ్ గురవుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే.. కూటమి ఏర్పాటు నుంచి ఆమెపై విమర్శలు చేసే వారు కూడా ఎక్కువయ్యారు. వైసీపీ నేతలే కాదు.. ఆ పార్టీకి చెందని అభిమానులు సోషల్ మీడియాలో పురంద్రీశ్వరిని అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారనడంలో సందేహం లేదు.

Ys Sharmila : నేటి నుంచి షర్మిల బస్సు యాత్ర

నేటి నుంచి కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైఎస్ షర్మిల బస్సు యాత్రతో జనం ముందుకు వెళుతున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో వైఎస్ షర్మిల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

Karnataka : కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల వేళ....కోట్ల విలువైన మద్యం స్వాధీనం

లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో భారీగా మద్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 98.52 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎన్నికల వేళ పంపిణీకి సిద్ధంగా ఉందన్న సమాచారంతో ఇంత విలువైన భారీ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Earth Quake : హిమాచల్‌ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ భూకంపం సంభవించింది. చంబా జిల్లాల్లో నిన్న రాత్రి ఈ భూప్రకపంనలు కనిపించాయి. రక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతగా నమోదయింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. చంబా పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలోని మనాలిలో ఈ భూప్రకంపనలు సంభవించాయి.





Tags:    

Similar News