Mon Mar 16 2026 14:28:22 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : నేటి నుంచి షర్మిల బస్సు యాత్ర
నేటి నుంచి కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బస్సు యాత్రతో జనం ముందుకు వెళుతున్నారు

నేటి నుంచి కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైఎస్ షర్మిల బస్సు యాత్రతో జనం ముందుకు వెళుతున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో వైఎస్ షర్మిల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
బద్వేల్ నియోజకవర్గం నుంచి...
ఈరోజు ఉదయం బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం అమగంపల్లి గ్రామం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర మంతటా షర్మిల పర్యటించనున్నారు. ఎన్నికల పర్యటనకు బయలుదేరే ముందు తల్లి విజయమ్మ నుంచి షర్మిల ఆశీస్సులు అందుకున్నారు. తనను ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నానని ఆమె ఎక్స్ లో తెలిపారు.
Next Story

