Fri Jan 24 2025 15:41:45 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : జగనన్నను ఓడించండి.. అవినాష్ కు ఓటేయకండి
వైఎస్ షర్మిల కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించారు.
వైఎస్ షర్మిల కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించారు. బద్వేలు నియోజకవర్గంలో బస్సు యాత్రను ప్రారంబించిన షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. హత్యా రాజకీయాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జగనన్నను ఓడించాలని ఆమె కోరారు. అలాగే కడప పార్లమెంటు నుంచి అవినాష్ రెడ్డిని ఓడించాలని కూడా ఆమె పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదా రావాలంటే...
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఆమె కోరారు. కాంగ్రెస్ వల్లనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కడపకు స్టీల్ ప్లాంట్ రావాలన్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలన్నా కాంగ్రెస్ కు ఓటేయాలని ఆమె కోరారు. కాంగ్రెస్ వల్లనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. హస్తం గుర్తుకే మీ ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు.
Next Story