3April-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పాటయింది కానీ.. నేతల్లో మాత్రం సఖ్యత కనిపించడం లేదు. బయటకు మాత్రం తాము మద్దతిస్తున్నట్లు చెబుతున్నారే తప్ప ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఒకసారి చేజారిన నియోజకవర్గం మళ్లీ మన చేతికి వస్తుందో? రాదో అన్న ఆందోళన నేతల్లో ఉంది.

Update: 2024-04-03 12:25 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

NDA Alliance : భయ్యా.. వీళ్లను గెలిపిస్తే... పాతుకుపోరూ.. అందుకే ఏసేయండి?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పాటయింది కానీ.. నేతల్లో మాత్రం సఖ్యత కనిపించడం లేదు. బయటకు మాత్రం తాము మద్దతిస్తున్నట్లు చెబుతున్నారే తప్ప ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఒకసారి చేజారిన నియోజకవర్గం మళ్లీ మన చేతికి వస్తుందో? రాదో అన్న ఆందోళన నేతల్లో ఉంది.

త్వరలో గల్ఫ్ సంఘాలతో హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

నెలాఖరున గల్ఫ్ దేశాలలో పర్యటించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ● గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినందుకు సీఎం కు కృతజ్ఞత తెలిపిన గల్ఫ్ జెఏసీ బృందం

తెలంగాణకు చెందిన కొమ్మారెడ్డి సుశీల్ కుటుంబానికి అమెరికాలో ఘోర కారు ప్రమాదం

అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ తెలుగు కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందగా, వారి తల్లిదండ్రులు బొమ్మిడి అనూష, కొమ్మారెడ్డి సుశీల్ రెడ్డితో పాటు 11 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. మార్చి 29న జాక్సన్ కౌంటీలో కారు ప్రమాదంలో వీరు గాయపడ్డారు.

Ys Sharmila : తొలిసారి ఎన్నికల బరిలోకి.. అలా జరిగితేనే షర్మిలమ్మ విజయం ఖాయమా?

వైఎస్ షర్మిల తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఆమె ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదీ ఎక్కడో కాదు.. కడప పార్లమెంటు నియోజకవర్గంలో. కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిలమ్మ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.

Summer Effect : మాడు పగులుతోంది.. మధ్యాహ్నం అయితే చాలు... నిప్పుల వర్షమే

ఎండలు ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ముదిరిపోయాయి. అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మే చివరి వారంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు అదరగొడుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.

Pensions : పింఛను పంపిణీ పై హైకోర్టు కీలక ఆదేశాలు

పింఛన్ల పై దాఖలైన పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాలంటీర్లను పింఛన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలయిన పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. పింఛను ఇంటివద్ద ఇవ్వకపోవడంతో పింఛను దారులు ఇబ్బందిపడుతున్నారని పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు.

నేడు పవన్ తెనాలి పర్యటన వాయిదా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా పడింది. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతోపాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేసినట్లు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు.

BRS : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇల్లు సీజ్

మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిని సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని హైదరాబాద్ నుంచి హాలియా మీదుగా నాగార్జునసాగర్ వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేను హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Earth Quake : తైవాన్ లో భారీ భుకంపం.. భవనాలు ఒరిగిపోవడంతో?

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7. 4 తీవ్రతగా నమోదు అయింది. ఇప్పటికే అధికారులు సునామి హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తైవాన్‌లో హువాలియన్‌ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు.

IPL 2024 : నేటి ఐపీఎల్ లో భలే మ్యాచ్ గురూ

నేడు జరగబోతున్న ఐపీఎల్ మ్యాచ్ ఇంట్రస్టింగ్ గా జరగనుంది. ఢిల్లీ కాపిటల్స్, కోల్్కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్టకు ఈ మ్యాచ్ కీలకమేనని చెప్పాలి. ఇప్పటి వరకూ కోల్్కత్తా నైట్ రైడర్స్ రెండు మ్యాచ్ లు ఆడగా రెండు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. దీంతో కేకేఆర్ విజయం తథ్యమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.



Tags:    

Similar News