Wed Mar 18 2026 17:45:13 GMT+0530 (India Standard Time)
నేడు పవన్ తెనాలి పర్యటన వాయిదా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా పడింది. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా పడింది. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతోపాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేసినట్లు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు.
విశ్రాంతి అవసరమని...
కనీసం రెండుమూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారని ఆయన అన్నారు. రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారని తెలిపారు. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. కాగా గత నాలుగు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అలాగే ఆయన పర్యటించారు.
Next Story

