Tue Jan 20 2026 04:49:04 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇల్లు సీజ్
మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని అధికారులు సీజ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిని సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని హైదరాబాద్ నుంచి హాలియా మీదుగా నాగార్జునసాగర్ వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేను హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
రాజకీయ కక్ష అంటూ...
రాజకీయ కక్ష సాధింపులు భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల కావాలనే తన ఇల్లు సీజ్ చేశారని నోముల భగత్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఇంట్లో విలువైన వస్తువులున్నాయని ఎందుకు సీజ్ చేశారో కారణాలు చెప్పాలంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. నోముల భరత్ సాగర్ వెళితే శాంతి భద్రతలు అదుపుతప్పుతాయని భావించి ఆయనను అడ్డుకున్నట్లు తెలిసింది.
Next Story

