Sat Dec 06 2025 00:08:37 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేటి ఐపీఎల్ లో భలే మ్యాచ్ గురూ
నేడు జరగబోతున్న ఐపీఎల్ మ్యాచ్ ఇంట్రస్టింగ్ గా జరగనుంది. ఢిల్లీ కాపిటల్స్, కోల్్కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది

నేడు జరగబోతున్న ఐపీఎల్ మ్యాచ్ ఇంట్రస్టింగ్ గా జరగనుంది. ఢిల్లీ కాపిటల్స్, కోల్్కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్టకు ఈ మ్యాచ్ కీలకమేనని చెప్పాలి. ఇప్పటి వరకూ కోల్్కత్తా నైట్ రైడర్స్ రెండు మ్యాచ్ లు ఆడగా రెండు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. దీంతో కేకేఆర్ విజయం తథ్యమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
చెన్నైను ఓడించి...
మరోవైపు ఢిల్లీ కాపిటల్స్ జట్టు కూడా పుంజుకుంది. ఈ సీజన్ లో మూడు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ కాపిటల్స్ రెండింటిలో ఓటమి చూసి ఒక మ్యాచ్ లో గెలిచింది. అందులోనూ చెన్నై సూపర్ కింగ్స్ మీద విజయం సాధించింది. దీంతో ఆ జట్టులో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ కారణంగా రెండు జట్లు తలపడటం మామూలుగా ఉండదంటున్నారు ఫ్యాన్స్.
Next Story

