బ్రేకింగ్ : కేవీపీ అరెస్ట్
నేరేడుచర్ల ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. నేరేడు చర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో శేరి సుభాష్ రెడ్డికి ఓటు హక్కు అవకాశం కల్పించి టీఆర్ఎస్ మున్సిపాలిటీని [more]
నేరేడుచర్ల ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. నేరేడు చర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో శేరి సుభాష్ రెడ్డికి ఓటు హక్కు అవకాశం కల్పించి టీఆర్ఎస్ మున్సిపాలిటీని [more]
నేరేడుచర్ల ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. నేరేడు చర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో శేరి సుభాష్ రెడ్డికి ఓటు హక్కు అవకాశం కల్పించి టీఆర్ఎస్ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. అయితే నిన్నటి జాబితా ప్రకారం కాకుండా ఈరోజు జాబితాను మార్చడంపై కాంగ్రెస్ భగ్గుమంది. నేరేడుచర్ల ఛైర్మన్ గా టీఆర్ఎస్ కు చెందిన జయబాబు ఎన్నికయ్యారు. దీంతో ఆగ్రహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేవీపీలు ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించారు. దీంతో ఆందోళనకు దిగిన కేవీపీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కేవీపీ ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. కేవీపీ, ఉత్తమ్ లను మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.