ఇప్పట్లో ఆగేలా లేదే..? కట్టడి చేయడం ఎలా?

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ఆయన [more]

Update: 2020-04-13 02:16 GMT

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 531కు చేరుకుంది. ఇప్పటికే తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. కరోనా వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదన్న ఆందోళనను సమావేశంలో కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News