అమరావతిపై స్పందించిన పవన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. జగన్ ఏపీకి ముఖ్యమంత్రా? లేక [more]

Update: 2019-12-30 14:44 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. జగన్ ఏపీకి ముఖ్యమంత్రా? లేక ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. పాలన అంతా ఒకే చోట నుంచి జరగాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిపై ఏకాభిప్రాయం సాధించి ఎక్కడికైనా తరలించుకోవచ్చని అన్నారు. సమాజంలో వైసీపీ అసమానతలను సృష్టిస్తుందన్నారు. గత ప్రభుత్వం తప్పులు చేస్తే చట్టపరంగా శిక్షించాలే కాని, రాజధాని తరలిస్తామనడం సరైన విధానం కాదన్నారు. జనసేన రైతుల పక్షపాతి అని ఆయన తెలిపారు.

Tags:    

Similar News