బ్రేకింగ్ : ఆదిలాబాద్ కాల్పుల్లో గాయపడిన జమీర్ మృతి
ఆదిలాబాద్ లో కాల్పుల ఘటనలో గాయపడ్డ జమీర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.. వారం రోజుల క్రితం ఎంఐఎం నేత జమీర్ పైన కాల్పులు జరిపారు. ఇంటిదగ్గర [more]
ఆదిలాబాద్ లో కాల్పుల ఘటనలో గాయపడ్డ జమీర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.. వారం రోజుల క్రితం ఎంఐఎం నేత జమీర్ పైన కాల్పులు జరిపారు. ఇంటిదగ్గర [more]
ఆదిలాబాద్ లో కాల్పుల ఘటనలో గాయపడ్డ జమీర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.. వారం రోజుల క్రితం ఎంఐఎం నేత జమీర్ పైన కాల్పులు జరిపారు. ఇంటిదగ్గర పిల్లలు ఆడుకునే గొడవలో ఇరువర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో జమీర్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. ఆపరేషన్ చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది. దీంతో పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. గత వారం రోజుల నుంచి జమీర్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఇవాళ ఉదయం పరిస్థితి విషమించి జమీర్ నిమ్స్ లో మరణించాడు.. ఈ సంఘటన సంబంధించి ఇప్పటికే జమీర్ పై కాల్పులు జరిపిన నేతలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.