కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదట.. అయితే వారిని మాత్రం?

జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు కన్పించడం లేదు. విస్తరణ రెండున్నరేళ్లు అనింది మూడేళ్లు కావస్తుంది.

Update: 2022-01-11 04:31 GMT

జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు కన్పించడం లేదు. మంత్రి వర్గ విస్తరణకు రెండున్నరేళ్లు అనింది మూడేళ్లు కావస్తుంది. మూడేళ్ల కాలం పూర్తయినా జగన్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు లేవన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పడున్న కేబినెట్ డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేని జగన్ విస్తరణ ఆలోచనను విరమించుకున్నారని ముఖ్యనేతలు సయితం అంగీకిరిస్తున్నారు. సంక్రాతి తర్వాత విస్తరణ ఉండవచ్చని తొలుత అనుకున్నా ఆ యోచనను విరమించుకున్నారట.

ఆర్థిక పరిస్థితి....
ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. సంక్షేమ పథకాలతోనే ఇంతవరకూ నెట్టుకొస్తున్నారు. అప్పులు చేసి మరీ పథకాలను అమలు చేస్తున్నారు. అభివృద్ధి పనులను ఆమడదూరం పెట్టేశారు. చేయాలన్నా నిధులు లేవు. మరో వైపు ఉద్యోగుల డిమాండ్లు, కేంద్రంలో బీజేపీ సహకారం కొరవడటం వంటి అంశాలు విస్తరణకు అడ్డంగా మారాయంటున్నారు. ఇప్పుడు మార్చినా కొత్తగా వచ్చే వారు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకునే సరికి ఆరు నెలలు పడుతుంది. ఇప్పుడున్న మంత్రులు అవగాహనతో విపక్షాలకు కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ టీమ్ తోనే...
అందుకే ఈ టీమ్ నే కొంతకాలం కొనసాగిస్తే బెటర్ అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి వచ్చే ఏడాది జనవరి లో మంత్రి వర్గ విస్తరణ చేయాలని జగన్ భావించారు. అందుకే ఆరోపణలున్న కొందరు మంత్రులను కేబినెట్ లో కంటిన్యూ చేస్తున్నారు. వాస్తవానికి ఇద్దరు మంత్రులను కేబినెట్ నుంచి ఎప్పుడో తప్పించాల్సి ఉంది. అయితే వారిని తప్పిస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన జగన్ వారిని కొనసాగిస్తున్నారని, విస్తరణలో వారిని లేపేయొచ్చని భావించారట.
వారిని మాత్రం....
కానీ విస్తరణ ఆలస్యం అవుతుండటంతో కొందరు మంత్రులను తొలగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా జగన్ ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా రాయలసీమ కు చెందిన ఇద్దరు, ఉత్తరాంధ్ర కు చెందిన ఒకరు, కోస్తాంద్ర జిల్లాలకు చెందిన మరొక మంత్రిని తప్పించి కొత్త వారిని తీసుకుని ఈ కేబినెట్ ను కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా జగన్ సమాలోచనలను జరుపుతున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News