సోమిరెడ్డి స్లో అయ్యారు..అందుకేనా?

రెండు నెలల నుంచి చంద్రబాబు కూడా సోమిరెడ్డిని లైట్ గా తీసుకుంటున్నట్లు కనపడుతుంది.

Update: 2022-01-13 05:52 GMT

తెలుగుదేశం పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక నేత. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆయన సీనియర్ నేత మాత్రమే కాకుండా రెడ్డి సామాజికవర్గం కూడా కావడంతో చంద్రబాబు ఆయనకు స్పెషల్ ప్రయారిటీ ఇస్తారు. వైసీపీపై మాటల దాడి చేయాలంటే టీడీపీ లో ఆ సామాజికవర్గం నుంచి సోమిరెడ్డి ఒక్కరే కనిపిస్తారు. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటీవల కాలంలో స్లో అయినట్లే కన్పిస్తుంది.

ప్రత్యేకంగా ప్రయారిటీ....
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. గత ఐదు పర్యాయాలు వరసగా ఓటమిపాలవుతున్నా సోమిరెడ్డి పట్ల చంద్రబాబు సాఫ్ట్ కార్నర్ గానే ఉండేవారు. జిల్లా రాజకీయాల్లోనూ ఆయన మాటకు చంద్రబాబు విలువ ఇచ్చేవారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి ఏం చెబితే అది జరిగేదన్నది వాస్తవం. అధికారంలో లేకపోయినా ఆయన జిల్లాలో పార్టీని శాసిస్తారు. కానీ ఒక రెండు నెలల నుంచి చంద్రబాబు కూడా సోమిరెడ్డిని లైట్ గా తీసుకుంటున్నట్లు కనపడుతుంది.
కార్పొరేషన్ ఎన్నికల తర్వాత....
దీనికి ప్రధాన కారణం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సోమిరెడ్డి దారుణంగా ఫెయిలయ్యారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. నామ్ కే వాస్తేగా ఇద్దరు కిందిస్థాయి నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా దీనికి ప్రధాన కారణం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కారణమని భావిస్తున్నారు. పార్టీ ఇంత చేసినా సోమిరెడ్డి సక్రమంగా కార్పొరేషన్ ఎన్నికలలో వ్యవహరించలేదని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది.
అందుకే.....
అందుకే ఇటీవల జరిగిన సమీక్షలోనూ కొన్ని చురకలు సోమిరెడ్డిపై పరోక్షంగా చంద్రబాబు వేశారంటున్నారు. సర్వేపల్లిలో కూడా ఈసారి కొత్త అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. సోమిరెడ్డికి పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీయో, రాజ్యసభ పదవో ఇస్తారు తప్పించి ఈసారి టిక్కెట్ ఇచ్చేది కూడా కష్టమేనని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి ఆధిపత్యానికి తెరపడేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటారని పార్టీ టాక్. అందుకే ఇటీవల కాలంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్లో అయ్యారంటున్నారు.


Tags:    

Similar News