తెలంగాణ నుంచి తొలి రైలు బయలుదేరింది

తెలంగాణ లో చిక్కుకుని పోయిన వలస కార్మికులకు ఊరట లభించింది. సంగారెడ్డిలోని కంది ఐఐటీ సమీపంలో చిక్కుకుపోయిన 1250 మంది వలస కార్మికుల ను తిరిగి వారి [more]

Update: 2020-05-01 06:16 GMT

తెలంగాణ లో చిక్కుకుని పోయిన వలస కార్మికులకు ఊరట లభించింది. సంగారెడ్డిలోని కంది ఐఐటీ సమీపంలో చిక్కుకుపోయిన 1250 మంది వలస కార్మికుల ను తిరిగి వారి సొంత ప్రాంతాలకు ప్రభుత్వం పంపిస్తుంది. కంది ఐఐటీ ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సుల్లో వలస కార్మికుల ని లింగంపల్లి రైల్వే స్టేషన్ కి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో రాంచీ వరకు కార్మికులను తీసుకువెళ్తారు. ఈ ఉదయం ఈ ప్రత్యేక రైలు ప్రారంభమై రాంచీకి బయలుదేరింది . అయితే మిగతా ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా ఇదే తరహాలో తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు . ఇప్పటికే వలస కార్మికుల పై కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. దీనికి అనుగుణంగానే రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాలూ ఒప్పుకున్న తర్వాతనే వలస కార్మికులను సొంత ప్రాంతాలకు పంపించాలని కేంద్రం చెబుతోంది. ఈ సందర్భంలో వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారిని సొంత గ్రామాలకు పంపించాలని కేంద్రం చెబుతోంది.

Tags:    

Similar News