బ్రేకింగ్ : మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనా తో మృతి

మాజీ పార్లమెంటు సభ్యుడు నంది ఎల్లయ్య మృతి చెందారు. ఆయన కరోనా బారిన పడి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. కాగా పరిస్థితి [more]

Update: 2020-08-08 07:05 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు నంది ఎల్లయ్య మృతి చెందారు. ఆయన కరోనా బారిన పడి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో ఆయన కొద్దిసేపటి క్రితం మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నంది ఎల్లయ్య ఆరు సార్లు లోక్ సభ కు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. సిద్ధిపేట నియోజకవర్గంనుంచి అప్పట్లో ఐదు సార్లు, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందారు. రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. నంది ఎల్లయ్య 1942 ల జన్మించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. నంది ఎల్లయ్య మృతితో కాంగ్రెస్ పార్టీ ఒక నేతను కోల్పోయినట్లయింది.

Tags:    

Similar News