అందరినీ తరలించాం.. ఇక ఇబ్బంది ఉండకపోవచ్చు
మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారు మూడు వేల మందితో కాంటాక్టు అయ్యారని, వారందరీనీ క్వారంటైన్ లో పెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల [more]
మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారు మూడు వేల మందితో కాంటాక్టు అయ్యారని, వారందరీనీ క్వారంటైన్ లో పెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల [more]
మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారు మూడు వేల మందితో కాంటాక్టు అయ్యారని, వారందరీనీ క్వారంటైన్ లో పెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన 1100 మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఇప్పుడిప్పుడే మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయన్నారు. అయినా కరోనా పట్ల ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్తం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం సమీక్షలు చేస్తున్నారన్నారు. ఐదు లక్షల పీపీఈ కిట్లను ప్రభుత్వం ఆర్దర్ ఇచ్చిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వద్ద ముప్ఫయి వేల పీపీఈ కిట్లు ఉన్నాయన్నారు. ఎన్ 95 మాస్క్ లను కూడా ఐదు లక్షలు ఆర్డర్ ఇచ్చామన్నారు. మూడున్నర లక్షల టెస్ట్ కిట్లను కూడా ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. పదిహేను రోజుల్లో 1500 పడకలతో గచ్చిబౌలిలో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశామని చెప్పారు. 22 ప్రయివేటు మెడికల్ కళాశాలల్లో ఉన్న ఆసుపత్రులను కూడా కోవిడ్ ఆసుపత్రులుగా మారుస్తున్నామన్నారు.