ఇలాంటి క్రేజ్ మొదటి సారి చూసాను: ఆ హీరోపై అమితాబ్ ప్రశంసలు

అమితాబ్ బచ్చన్ కి నచ్చిన దక్షిణాది నటుడు ఎవరో తెలుసా? ఇంకెవరు? ఈ ఏడాది జాతీయ అవార్డు గ్రహీత, పుష్పరాజ్ అల్లు అర్జున్. ఇటీవల జరిగిన కౌన్ బనేగా కరోడ్ పతి ఎపిసోడ్ లో బన్నీ పై బిగ్ బి ప్రశంసల వర్షం కురిపించాడు.

Update: 2023-11-14 09:48 GMT

అమితాబ్ బచ్చన్ కి నచ్చిన దక్షిణాది నటుడు ఎవరో తెలుసా? ఇంకెవరు? ఈ ఏడాది జాతీయ అవార్డు గ్రహీత, పుష్పరాజ్ అల్లు అర్జున్. ఇటీవల జరిగిన కౌన్ బనేగా కరోడ్ పతి ఎపిసోడ్ లో బన్నీ పై బిగ్ బి ప్రశంసల వర్షం కురిపించాడు. 69 వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు ఎవర్ని వరించింది అని అమితాబ్ ఓ పోటీదారుని ప్రశ్నించారు. దీనికి హాట్ సీట్ లో ఉన్న వ్యక్తి అల్లు అర్జున్ అంటూ సరైన సమాధానం చెప్పారు.

ఈ సందర్బంగా అమితాబ్.. పుష్ప సినిమాలో అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ పై అల్లు అర్జున్ ని పొగడ్తల్లో ముంచెత్తారు. 'పుష్ప చాలా గొప్ప సినిమా. పుష్పరాజ్ పాత్రను అల్లు అర్జున్ చాలా అద్భుతంగా పోషించారు. శ్రీవల్లి పాటలో చెప్పులు హుక్ పాట నాకు చాలా బాగా నచ్చింది' అంటూ చెప్పారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. 

శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ డాన్స్ చేస్తున్నపుడు కాలి చెప్పు స్లిప్ అవుతుంది. దానిని కూడా డాన్స్ భంగిమ గా మార్చి, ఆ పాటని ఎంతో పాపులర్ చేసారు ఐకాన్ స్టార్ అల్లు.  'డాన్స్ స్టెప్ ఎంతో పాపులర్ అయింది. సోషల్ మీడియా లో ఎంతోమంది దానిని అనుకరించారు. ఇలాంటి క్రేజ్ ని నా జీవితంలో మొదటిసారి చూసాను'  అని అమితాబ్ ప్రశంసించారు. 

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప - 1 2021 లో రిలీజ్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా సంచలన విజయం నమోదు చేయడమే కాకుండా, అల్లు అర్జున్ ని జాతీయ ఉత్తమ నటుడ్ని చేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప-2  2024ఆగష్టు 15 న విడుదలకు సిద్ధమవుతోంది. 

Tags:    

Similar News