అందుకే సుక్కు అంత స్పెషల్‌!

టాలీవుడ్‌ డైరెక్టర్లలో సుకుమార్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అతని సినిమాల్లో కథ ఉంటుంది. హీరోయిజం ఉంటుంది. తను ఇవ్వాలనుకున్న మెసేజ్‌ ఉంటుంది. హీరోకి దర్శకుడికి కూడా పేరొచ్చే సినిమాలు కేవలం ఆయన మాత్రమే తీయయగలడు. ఈ తరంలో మిగిలిన దర్శకులంతా ఒక వైపు ఉంటే, సుకుమార్‌ మరోవైపు ఉంటారు. ఆయన సినిమా ఎప్పుడు చూసినా కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. కంటెంట్‌ ఉన్న సినిమాలు మాత్రమే కలకాలం మెప్పిస్తాయి. ఈ విషయంలో సుకుమార్‌ వందకు వంద మార్కులు సాధిస్తారు.

Update: 2023-08-29 04:42 GMT

టాలీవుడ్‌ డైరెక్టర్లలో సుకుమార్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అతని సినిమాల్లో కథ ఉంటుంది. హీరోయిజం ఉంటుంది. తను ఇవ్వాలనుకున్న మెసేజ్‌ ఉంటుంది. హీరోకి దర్శకుడికి కూడా పేరొచ్చే సినిమాలు కేవలం ఆయన మాత్రమే తీయయగలడు. ఈ తరంలో మిగిలిన దర్శకులంతా ఒక వైపు ఉంటే, సుకుమార్‌ మరోవైపు ఉంటారు. ఆయన సినిమా ఎప్పుడు చూసినా కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. కంటెంట్‌ ఉన్న సినిమాలు మాత్రమే కలకాలం మెప్పిస్తాయి. ఈ విషయంలో సుకుమార్‌ వందకు వంద మార్కులు సాధిస్తారు.

సినిమాలాంటి సృజనాత్మక మాధ్యమంలో ప్రతీ కళాకారుడికీ ఒక్కో స్టయిల్‌ ఉంటుంది. దర్శకుడి ఆలోచన విధానం మీదే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలా టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకులంతా తమ పద్ధతిలో జనం మద్దతు సంపాదించినవాళ్లే. కళాతపస్వి విశ్వనాధ్‌ సినిమా అంతా అతని ఆలోచనా విధానం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అతను చెప్పినట్లే నటులు నటించాలి. వాళ్లకు ఎలా నటించాలో కూడా చేసి చూపిస్తాడు. బాపూ, వంశీ కూడా ఇదే తరహాలో సినిమాలు తీశారు. రాఘవేంద్రరావు హీరోయిన్లను ఆందంగా చూపిస్తారు. హీరోయిజాన్ని బాగా ఎలివేట్‌ చేస్తారు. పాటల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. కోదండరామిరెడ్డి స్క్రిప్ట్‌ వర్క్‌ బాగా చేస్తారు. ఆయన సినిమాలేవీ బోరు కొట్టవు. కంటెంట్‌ ప్రధానంగా సాగుతాయి.

ఈ తరంలో ఫెయిల్యూర్‌ లేని దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమాల్లో ఎమోషన్ప్‌ బాగా వర్కవుట్‌ అవుతాయి. గ్రాఫిక్స్‌ని ఆయనంత ఎఫెక్టివ్‌గా వాడుకునే దర్శకుడు ఈ దేశంలో మరెవరూ లేరు. క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్‌ కోసం చాలా డబ్బులు, సమయం కూడా ఖర్చు పెడతారు. తను అనుకునే అవుట్‌ పుట్‌ వచ్చేదాకా కాంప్రమైజ్‌ అవరు. ఆయన సినిమాల్లో హీరో కంటే ఆయనకే ఎక్కువ పేరు వస్తుంది. హీరో ఎవరైనా రాజమౌళి సినిమా అనే అంటారు. విశ్వనాధ్‌, మణిరత్నం, బాలచందర్‌, సత్యజిత్‌రే లాంటి దర్శకుల్లా రాజమౌళి సినిమాలు కూడా దర్శకుడి సినిమాలే. మిగిలిన వాళ్లంతా కంటెంట్‌ను నమ్ముకుంటే రాజమౌళి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మీద ఆధారపడి ఉంటాయి. భారీ బడ్డెట్‌, భారీగా లాభాలు.. ఇవే రాజమౌళి సినిమాకు ప్రాతిపదిక. త్రివిక్రమ్‌ డైలాగుల మీద ఆధారపడే ఆయన సినిమాలు నడుస్తాయి. సంభాషణల్లో పంచ్‌లు, హ్యూమర్‌, పురాణాల్లోంచి రిఫరెన్సులు, విజువల్‌ క్వాలిటీ ఆయన ప్రత్యేకతలు.

వీళ్లందరి కంటే భిన్నమైన శైలి సుకుమార్‌ది. సహజంగా గణిత శాస్త్ర అధ్యాపకుడైన సుకుమార్‌ సినిమాలో లాజిక్‌ కూడా అలానే ఉంటుంది. ఆయన స్క్రిప్ట్‌ వర్క్‌ పక్కాగా చేస్తారు. ప్రెస్‌మీట్లలో గాభరాగా మాట్లాడే అతను సినిమాను మాత్రం ప్రశాంతంగా తీస్తారు. సుకుమార్‌ హీరో ఎలివేట్‌ అవుతాడు. దర్శకుడిగా సుకుమార్‌ కూడా ఎలివేట్‌ అవుతారు. ఇది దర్శకుడిగా సుకుమార్‌ విజయం. ఓ ప్రధానాంశం చుట్టూ ఆయన కథ తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఎన్ని సబ్‌ప్లాట్‌లు ఉన్నా అవన్నీ ఒకే దారానికి (థ్రెడ్‌) చుట్టుకుని ఉంటాయి. అతని హీరోలకు... సామాన్యులకు ఉండే లోపాలన్నీ ఉంటాయి. అవి మానసికమైనవి కావచ్చు, శారీరకమైనవి కావచ్చు. హండ్రెడ్‌ పెర్సెంట్‌ లవ్‌లో హీరోకి ఈగో ఎక్కువ. రంగస్థలంలో చిట్టిబాబు చెవిటివాడు. పుష్పరాజ్‌ సామాజికంగా అవమానాలకు గురి అవుతూ ఉంటారు. వీటిని కూడా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌గా వాడుకోవచ్చని, విజయాన్ని అందుకోవచ్చని సుక్కు రుజువు చేస్తున్నారు. ఆయన సినిమా చూసిన తర్వాత దర్శకుడిగా ఆయన తెలివితేటలకు ముచ్చట పడతాం. ఓ కమర్షియల్‌ సినిమా బడ్జెట్‌తో పాన్‌ ఇండియాను మెప్పించడం అంత సులువు కాదు. దానిని అలవోకగా చేయగలగడం సుకుమార్‌ స్పెషల్‌.

Tags:    

Similar News