మరో ఐదు వారాలు కష్టమే… ఆగని కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 1,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో [more]

Update: 2020-07-24 02:42 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 1,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,826కు చేరుకుంది. కరోనా కారణంా ఇప్పటి వరకూ తెలంగాణలో మృతి చెందిన వారి సంఖ్య 447గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,052 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 39,327 గా ఉంది. తాజాగా నమోదయిన కొత్త కేసుల్లో అత్యధిక శాతం హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. హైదరాబాద్ లో ఒక్కరోజే 662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా మరో ఐదు వారాల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల చెబుతున్నారు. ప్రజలు స్వీయనియంత్రణను పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News