స్కోరు పెరుగుతోంది.. ఎంత ప్రయత్నించినా ఆగడం లేదే?

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దమొత్తంలో కేసుల నమోదవ్వడం ఇదే తొలిసారి. నమోదయిన కేసుల్లో అత్యధికంగా [more]

Update: 2020-06-23 02:59 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దమొత్తంలో కేసుల నమోదవ్వడం ఇదే తొలిసారి. నమోదయిన కేసుల్లో అత్యధికంగా 713 కేసులు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8674కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 217 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ 4005 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మీద రోజురోజుకూ తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News