కోలుకుంటున్న తెలంగాణ.. తగ్గుతున్న కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్లే కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శనివారం నాడు కేవలం ఏడు [more]

Update: 2020-04-26 01:53 GMT

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్లే కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శనివారం నాడు కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదు కావడంతో ప్రభుత్వం కూడా కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్లేనని భావిస్తుంది. ప్రస్తుతం తెలంగాణాలో 990 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య తగ్గుతుండటంతో కంటెయిన్ మెంట్ జోన్లను కూడా తగ్గించే యోచనలో అధికారులు ఉన్నారు. మరో వారంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మే మొదటి వారానికి కరోనా తెలంగాణలో నియంత్రించగలమన్న ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వం ఉంది.

Tags:    

Similar News