డ్రగ్స్ కేసులో హైకోర్టు సీరియస్….?

డ్రగ్స్ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. డ్రగ్స్ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటీషన్ [more]

Update: 2021-04-30 01:04 GMT

డ్రగ్స్ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. డ్రగ్స్ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటీషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 2016 లో నమోదయిన డ్రగ్స్ కేసు వివరాలను ఈడీకి ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. డ్రగ్స్ తో సంబంధం ఉన్న వారి వివరాలను దాచిపెట్టాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. డ్రగ్స్ పై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏం చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ఠు ఆదేశించింది.

Tags:    

Similar News