సీనియర్ నేత ఎం సత్యనారాయణ మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు మృతి చెందారు. ఆయన కరోనా బారిన పడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ [more]

Update: 2021-04-27 02:15 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు మృతి చెందారు. ఆయన కరోనా బారిన పడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నేతగా సత్యనారాయణరావుకు పేరుంది. ఆర్టీసీ ఛైర్మన్ గా కూడా సత్యనారాయణరావు పనిచేశారు. సత్యనారాయణరావు మృతితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను కోల్పోయినట్లయింది.

Tags:    

Similar News