నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా

రేపు ఢిల్లీలో జరిగే నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు

Update: 2022-08-06 10:59 GMT

నీతి అయోగ్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మిషన్ కాకతీయకు ఐదువేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని నీతి అయోయ్ సిఫార్సు చేసిందని, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. మిషనగ్ భగీరధకు 19,500 కోట్లు గ్రాంటు ఇవ్వాలని సిఫార్సు చేసినా పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మోదీకి లేఖ రాశానని చెప్పారు. ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పుల మీద కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను తెచ్చిందన్నారు. ఈకొత్త నిబంధనలో కొత్తగా ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బ్రేకులు పడతాయని అభిప్రాయపడ్డారు.

నీతి లేని అయోగ్ గా....
రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం బాగుపడుతుందన్నారు. రూపాయి విలువ పడిపోయిందని, నిరుద్యోగం పెరిగిందఅన్నారు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవమరిస్తుందన్నారు. ముఖ్యమైన అంశాలను నీతిఅయోగ్ చర్చించడం లేదని, నిర్ధరక సంస్థగా మారిపోయిందని కేసీఆర్ తెలిపారు. ప్రధానికి భజన చేసే మండలిగా మారిపోయిందన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి అయోగ్ లో నీతి అంత ఉందన్నారు. కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలని అన్నారు.


Tags:    

Similar News