జగన్ ఆ పని చేస్తే మరింత ప్రమాదం

సెప్టంబరు నుంచి జగన్ ప్రభుత్వం పాఠశాలలను తెరిచే ప్రయత్నం చేస్తుందని, ఇది అత్యంత ప్రమాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పది వేలకు [more]

Update: 2020-08-26 02:30 GMT

సెప్టంబరు నుంచి జగన్ ప్రభుత్వం పాఠశాలలను తెరిచే ప్రయత్నం చేస్తుందని, ఇది అత్యంత ప్రమాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పది వేలకు పైగా రోజుకు కేసులు నమోదవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో పాఠశాలలను ప్రారంభించడం సరికాదన్నారు. లిక్కర్ షాపులను తెరవడం వల్లనే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువయిందని, పాఠశాలలు తెరిస్తే మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇళ్ల స్థలాల పేరిట వైసీపీ నేతలు పెద్దయెత్తున కుంభకోణానికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News