బ్రేకింగ్ : చంద్రబాబు సంచలన నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికల్లో?
రాజ్యసభ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకే తాము పోటీ చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో చూపించి [more]
రాజ్యసభ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకే తాము పోటీ చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో చూపించి [more]
రాజ్యసభ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకే తాము పోటీ చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో చూపించి ఓటు వేయాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్యను బరిలోకి దింపుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని అన్నారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు కుల, నివాస సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా విగ్రహాలకు ముసుగులు వేయలేదన్నారు. ఎన్నికలు నిర్వహింకచలేకపోతే వాయిదా వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు సిగ్గులేని రాజకీయం చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారని, వారు మీ ఆటలు సాగనివ్వరని చంద్రబాబు హెచ్చరించారు. గ్రామపంచాయతీకి వేసిన రంగులు తొలగించాలంటే మూడు వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. అధికారులు కూడా వైసీపీ కార్యకర్తలకు సహకరిస్తున్నారన్నారు. స్థానిక సంస్థలను హడావిడిగా పెట్టి బీసీలను రాజకీయ సమాధి చేశారన్నారు. భయపడి, బెదిరించి టీడీపీ నేతలను లొంగదీసుకోవాలని చూస్తున్నారన్నారు. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.