Sankranthi : ఘుమఘుమలాడే వంటలు.. సంక్రాంతికి ఇవి ప్రత్యేకం

సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు...గంగిరెద్దులు.. కోడిపందేలు మాత్రమే కాదు. పిండి వంటలు

Update: 2026-01-15 11:56 GMT

సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు...గంగిరెద్దులు.. కోడిపందేలు మాత్రమే కాదు. పిండి వంటలు ఘుమఘమలు ముక్కుపుటాలను అదరగొడతాయి. రైతులకు పంట చేతికొచ్చే సమయం కావడంతో ప్రతి ఇంటా పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఏ ఇంట చూసినా వంటింట పొయ్యిలు వెలుగుతూనే ఉంటాయి. సంక్రాంతికి ముందు నుంచే పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమవుతార. కొత్తగా పెళ్లయి ఇంటికి వచ్చే అల్లుడికి ఇష్టమైన పిండివంటలు తయారు చేసి పెడతా,ు. ఇంటికి వచ్చే బంధువులు, దూర ప్రాంతాల ఉన్న వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసి మరీ ఈ సంక్రాంతి పండగకు రాని వాళ్లకు కూడా తినుబండారాలనను పంపడం సంప్రదాయంగా వస్తుంది.

అరిసెలు ప్రత్యేకం...
అయితే శీతాకాలంలో తయారు చేసే ఈ స్వీట్లకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉంటాయని పెద్దలు చెబుతారు. అందుకే సంక్రాంతి పండగ కోసం ప్రత్యేకించి కొన్ని రకాల స్వీట్లను మాత్రమే తయారు చేస్తారు.దేని రుచి దానిదే. ఆ స్వీట్ పేరు ఉంటేనే నోట్లో నుంచి లాలాజలం ఊరిపోతుంది. సంక్రాంతికి ప్రత్యేకంగా తయారు చేసే స్వీట్లలో ప్రధానమైదని అరిసెలు. అనేక రకాలుగా అరెసెలను తయారు చేస్తారు. బెల్లంతో తయారు చేసిన అరిసెలను ఎక్కువ మంది ఈ సంక్రాంతికి తయారు చేస్తారు. అరిసెలు లేని సంక్రాంతి పండగ ఏ ఇంటా ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో అరిసెలను తయారు చేయడం పండగకు ముందు పది రోజుల నుంచే ప్రారంభిస్తారు.
అరెసెల తయారీకి...
బియ్యాన్నిరోట్లలో దంచి ఒకప్పుడు అరిసెల కోసం బియ్యపు పిండిని తయారు చేస్తారు. ఆతర్వాత అందులో బెల్లాన్ని కలుపుతారు. బెల్లం పాకం పట్టి అందులో నువ్వులను కూడా జోడించి నూనెలో వేయించి తయారు చేస్తారు. అరెసెలు ఆరోగ్యానికి మంచిదంటారు. రక్తాన్ని శుభ్రంచేయడమే కాక, బెల్లం కావడంతో ఐరన్ కూడా శరీరానికి పుష్కలంగా లభిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే ఈ సంక్రాంతికి తయారయ్యే మరో ప్రత్యేక వంటకం సున్నండలు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ వంటకం ప్రతి ఇంటా కనిపిస్తుంది. మినపప్పు, నెయ్యి,బెల్లంతో దీనిని తయారుచేస్తారు. మినుములు శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే బెల్లం కూడా ఐరన్ అందించడంతో శీతాకాలంలో అదీ సంక్రాంతి వేళ ఈ పిండి వంటకం కూడా ప్రత్యేకమే.
జంతికలు.. మణుగుపూలు...
ఇక సంక్రాంతికి తయారు చేసే జంతికలు కూడా ప్రత్యేకత సంతరించుకున్నాయి. తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ సంక్రాంతి వేళ ఈ జంతికలు కనిపిస్తాయి. బియ్యం, పెసరపప్పు, శనగపిండి, ఉప్పు, కారంతో దీనిని తయారు చేస్తారు. అరిసె తిన్న తర్వాత ఖచ్చితంగా జంతికలు తినాల్సిందే. ఎందుకంటే ఇందులో వాము ను కూడా కలుపుతారు కాబట్టిసులువగా జీర్ణం అవుతుంది. కారంగా, ఉప్పగా ఉండే ఈ జంతికలు ప్రత్యేక రుచిని కలిగి ఉండటంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సాయంత్రం వేళ దీనిని నోట్లో వేసుకుని తీరాల్సిందే. అందుకే సంక్రాంతి వేళ కేవలం కోడిపందేలు మాత్రమే కాదు.. పసందైన రుచులు కూడా. అందుకే సంక్రాంతి అంటేనే స్పెషల్ స్వీట్స్ అని చెప్పక తప్పదు. కానీ ఇప్పుడు ఇంట్లో తయారు చేయడం కంటే బయట షాపుల్లో కొనుగోలు చేయడం ఎక్కువయింది. కానీ గ్రామాల్లో మాత్రం నేటికీ ఇళ్లలో పిండి వంటల తయారీ కొనసాగుతూనే ఉంది.


Tags:    

Similar News