Andhra Pradesh : సంక్రాంతి పండగ నాడు ఉద్యోగుల ఖాతాల్లో వేల రూపాయల నగదు
సంక్రాంతి పండగకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
సంక్రాంతి పండగకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బ్యాంకు అకౌంట్ లో ఈరోజు ఉదయం అరవై నెలల బకాయీలను చెల్లించింది. లక్షలాది మంది ఉద్యోగులకు నేడు నిజమైన సంక్రాంతి అని సంబరపడిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన డీఏ ను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగుల ఖాతాల్లోకి ఒక్కసారిగా వేలాది రూపాయలు ఒక్కొక్క ఖాతాకు జమ అయ్యాయి. దీంతో ఉద్యోగులకు నేడు నిజమైన సంక్రాంతి పండగను జరుపుకుంటున్నారు.
కరువు భత్యం కింద...
ఒక్కొక్క ఉద్యోగికి ముప్ఫయి నుంచి అరవై వేల రూపాయల వరకూ డీఏ బకాయీలను ప్రభుత్వం విడుదల చేసింది. సంక్రాంతి పండగ నాటికి ఉద్యోగుల కరువు భత్యం బకాయీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈరోజు ఉదయం నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. 2018,2019 సంవత్సరానికి సంబంధించి కరువు భత్యాన్నిచెల్లించేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేయడంతో సంక్రాంతికి వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరాయి.
పింఛను దారులకు కూడా...
రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పింఛను దారులకు కూడా కరువు భత్యం చెల్లించారు. 1,100 కోట్లు జమ అయినట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. 2018 కరువు భత్యం బకాయీలు ముప్ఫయి నెలలు విడుదల కావాల్సి ఉంది. అలాగే 2019 నాటి ముప్ఫయి నెలల కరవు భత్యం విడుదల కావాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం ఈ కరువు భత్యాన్ని విడుదల చేయకపోవడంతో చంద్రబాబును కలిసిన ఉద్యోగ సంఘాలు తమ గోడును చెప్పుకోవడంతో ఈ నిధులను సంక్రాంతి పండగకు విడుదల చేశారు.