చిత్తూరు జిల్లాలో మొదలయిన జల్లికట్టు పోటీలు

సంక్రాంతి సందర్భంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి

Update: 2026-01-15 07:15 GMT

సంక్రాంతి సందర్భంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు సంప్రదాయ వేడుక అయిన జల్లికట్టును రాష్ట్రానికి ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలోనూ జల్లికట్టు వేడుక జరుగుతుంది. ఈ జల్లికట్టు వేడుకలను చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలి వస్తారు. పండగ వేళ ఈ జల్లికట్టు పోటీలను నిర్వహించడం చిత్తూరు జిల్లాలో సంప్రదాయంగా సాగుతూ వస్తుంది. పశువులపండగగా భావించి ఈ జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. తరతరాల సంప్రదాయంగా ఈ జల్లికట్టు తమిళనాడులోనూ, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోనూ జరుగుతుంది.

సంప్రదాయంగా...
సంప్రదాయ క్రీడగా దీనిని తమిళనాడు గుర్తిస్తారు. ఈ జల్లికట్టు పోటీలను చూసేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారు. అయితే పరిగెత్తే పశువులను కట్టడి చేయడానికి ఈ పోటీ నిర్వహిస్తారు. పరుగులు తీస్తున్న పశువులను పట్టుకోవడానికి యువకులు ఉత్సాహంగా పోటీ పడతారు. తమిళనాడు తరహాలో జరిగే ఈ పోటీలకు సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. అయితే ఈ సందర్భంగా ఏదైనా గాయాలు తగలితే వెంటనే చికిత్స అందించడానికి, ప్రాధమిక చికిత్స అందచేయడానికి అవసరమైన వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తారు.


Tags:    

Similar News